ప్రతి రైతుకు యూరియా అందాలి
ప్రతి రైతుకు యూరియా అందాలి
- మాట ఇచ్చిన కొన్నిగంటల్లోనే.. తక్షణ స్పందన
- బాపట్ల మార్కెట్ యార్డులో అకస్మిక తనిఖీ
- జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశం
- ప్రతి రైతుకు యూరియా అందాలి
బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోని జిల్లా రైతాంగం(District farmers) సమస్యలపై దృష్టి సారించి అధికారులను బాపట్ల కలెక్టర్(Bapatla Collector) హడలెత్తించారు.
రైతుల కళ్ళల్లో ఆనందాన్నిచూశారు. సమస్యల పట్ల దూసుకుపోయే డైనమిక్ కలెక్టర్ బాపట్ల కు వచ్చాడంటూ ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏ ఒక్క రైతు యూరియా(Urea) దొరకలేదని అనకూడదు. ప్రతి ఒక్కరికి అవసరమైన మేరకు యూరియా, డీఏపీ(DAP) అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వీ వినోద్ కుమార్ ఆదేశించారు.
బాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కొన్నిగంటలలోనే జిల్లాలోని రైతాంగం సమస్యలకు స్పందించారు. బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో గల యూరియా పంపిణీ కేంద్రా(Distribution Center)న్నిఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కొక్క రైతుకు ఎన్ని బస్తాలు యూరియా ఇస్తున్నారు.
మండలంలో వ్యవసాయ భూమి ఎంత ఉంది. పంట ఏ దశలో ఉంది. ఈ నెలలో జిల్లాలో యూరియా అవసరాలు ఎంత ఉన్నాయి? అందుకు అవసరమైన యూరియా నిలవలు సరిపడా ఉన్నాయా, లేదా అని అధికారులను ప్రశ్నల వర్షం కురిపించారు.
స్థానికంగా ఉన్న రైతులను వారి సమస్యల(problems)ను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు వీరితోపాటు వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.
