ఉపాధ్యాయుల‌కు క‌లెక్ట‌ర్ మెప్పు..

ఉపాధ్యాయుల‌కు క‌లెక్ట‌ర్ మెప్పు..

కాగ‌జ్న‌గ‌ర్ రూర‌ల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : గిన్నెధ‌రి గిరిజ‌న సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల‌(Ashram School)ను జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేష్ ధోత్రే(Venkatesh Dhotre) ఆక‌స్మికంగా సంద‌ర్శించి విద్యార్థుల‌తో ప్ర‌త్య‌క్షంగా సంభాషించారు.

విద్యార్థుల చ‌దువు స్థాయిని అంచ‌నా వేసేందుకు ప‌లు స‌బ్జెక్టులపై ప్ర‌శ్న‌లు అడిగారు. క‌లెక్ట‌ర్ ప‌ర్యావ‌ర‌ణ‌, విజ్ఞానం, గ‌ణితం వంటి పాఠ్యాంశాల‌(Curriculum)పై విద్యార్థుల‌ను ప్ర‌శ్నించ‌గా వారు ఇచ్చిన స‌మాధానాలు సంతృప్తిక‌రంగా ఉండ‌టంతో క‌లెక్ట‌ర్ అభినంద‌న‌ల‌తో పాటు సంతోషం వ్య‌క్తం చేశారు.

విద్యార్థుల‌కు ఏక‌రూప యూనిఫామ్స్ అంద‌జేశారు. ప్ర‌భుత్వ సౌక‌ర్యాల‌(Facilities)ను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఉన్న‌త విద్య అభ్య‌సించాల‌ని విద్యార్థుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్నఉపాధ్యాయుల సేవ‌ల‌ను క‌లెక్ట‌ర్ అభినందిచారు. వారు విద్యార్థుల(students) విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నార‌ని మెచ్చుకున్నారు. వ‌ర్షాకాలం నేప‌థ్యంలో విద్యార్థుల ఆరోగ్యం ప‌ట్ల మెడిక‌ల్ సిబ్బందికి ప్ర‌త్యేక సూచ‌న‌లు చేశారు.

Leave a Reply