నాగుల పంచమి సందర్భంగా నాగుల పుట్టకు ప్రత్యేక పూజలు

వికారాబాద్, ఆంధ్రప్రభ: నాగుల పంచమి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఎల్ఐసీ లైన్‌లో ఉన్న శ్రీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాగచైతన్య మందిరంలోని నాగుల పుట్టకు మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు నాగుల పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.

భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు, మాజీ కౌన్సిలర్ రమేష్ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఈ ఆలయానికి నాగుల పంచమి సందర్భంగా ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తుంటారని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.