అక్రమంమద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్టు
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు మోర్తాడ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ బి.మానస తెలిపారు. శనివారం ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా వైన్ షాప్ లు ముసివేయగా గడ్డం. మహేష్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్ముతున్నడన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి లిక్కర్ స్వాధీనం చేసుకునీ నిందితుడు మహేష్ ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ బి. మానస తెలిపారు. అతని వద్ద 3.42 లీటర్ల విస్కీ బాటిళ్లు,7.8 లీటర్ల బీరు బాటిళ్లను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కమలాకర్, దిగంబర్, శివ కుమార్, సతీష్, జలపతి, మమత, రజిత తదితరులు పాల్గొన్నారు.
