కనకదుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మవారిని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన శేఖర్ మాస్టర్‌కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం శేఖర్ మాస్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
