ఘనంగా డీసీసీ సుగుణక్క జన్మదిన వేడుకలు..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జన్మదిన వేడుకలను జైనూర్ మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ రషీద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సుగుణక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ రషీద్, డీసీసీ కార్యవర్గ సభ్యులు పేందూర్ ప్రకాష్, సర్పంచులు కనక ప్రతిభ, మడవి మనోహర్, తొడసం రాజేందర్, ఉయిక చందు, పెందూర్ అనసూయ, అర్జున్, పత్రం నిర్మల, శశిపాల్, ఆదివాసీ సీనియర్ నాయకులు కుమ్ర దుందేరావ్, జైనూర్ మాజీ కోఆప్షన్ సభ్యుడు అఫ్రోజ్ ఖాన్, మండల నాయకులు హజ్జు లాలా, అస్లం ఖాన్, షేక్ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.
