తెలంగాణలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. మీ పేరు ఉందో చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు అదనంగా కొత్తగా మరికొంత మందిని జాబితాలో చేర్చారు. మీ పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, స్మార్ట్ రేషన్ కార్డు వివరాలు నమోదయ్యాయో లేదో ఆన్‌లైన్‌లో వెంటనే తెలుసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని ఎఫ్‌ఎస్‌సీ సెర్చ్ ఆప్షన్ ద్వారా వివరాలను పరిశీలించుకోవచ్చు. పాత రేషన్ కార్డు నంబర్ లేదా దరఖాస్తు సమయంలో ఇచ్చిన కుటుంబ సభ్యుల వివరాలతో శోధించాలి. కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు వివరాలు కనిపిస్తే.. నమోదు పూర్తయినట్లు అర్థం.

పేరు కనిపించకపోతే?

ఆన్‌లైన్‌లో పేరు కనిపించకపోయినా వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు రద్దయిందని దాని అర్థం కాదు. వివరాల నిర్ధారణ కోసం సమీపంలోని మండల పౌర సరఫరాల అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచించారు.