బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి

నూతన వధూవరులకు శుభాకాంక్షలు..
కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చట

ఆంధ్రప్రభ ,వెబ్ డెస్క్: సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం.. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకలో నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి.. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. అనంతరం బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖుల రాకతో వివాహ వేడుక సందడిగా సాగింది.