గౌతు లచ్చన్నకు ఘన నివాళులు..
బంటుమిల్లి, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం, రైతు సంక్షేమం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం ఎన్నో ఉద్యమాలు నడిపిన మహోన్నత నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా బంటుమిల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కులు, రైతుల సంక్షేమం కోసం సర్దార్ గౌతు లచ్చన్న గారు చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆశయాలు, స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకం అన్నారు.
