అన్నదానానికి రూ.2.25 లక్షల విరాళం…
భక్తిశ్రద్ధలతో విరాళాలు అందజేసిన భక్తులు
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన విభాగానికి భక్తులు విరాళాలు సమర్పించారు. సత్తెనపల్లి భవిరిశెట్టి వారి వీధికి చెందిన దేవిశెట్టి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా అందజేశారు.
అదేవిధంగా విశాఖపట్నం కు చెందిన ఎస్. చక్రన్ షణ్ముఖ్, కుటుంబ సభ్యులు రూ.1,25,000 విరాళంగా సమర్పించారు. మొత్తం రూ.2,25,116ను అమ్మవారి అన్నదాన విభాగానికి అందించారు. ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, అర్చక స్వాముల సమక్షంలో భక్తులు విరాళాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా వేద పండితుల వేద ఆశీర్వచనం అనంతరం ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు.
