ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు,..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు, శనివారం జాతీయ జెండాలు ఎగురవేసే ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు గ్రామపంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో, జాతీయ జెండాలు ఎగురవేసి వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్ తవుటం లక్ష్మి, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ వసంతరావు, ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ వాల్య నాయక్, పోలీస్ స్టేషన్లో సిఐ దగ్గు మల్లేష్ ,పిఎసిఎస్ లో చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీల కార్యాలయాల్లో అధ్యక్షులు దబ్బేట అనిల్, బుర్ర వెంకటేష్ గౌడ్ , అల్లం రవీందర్, ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు కట్కూరి మొగిలి, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, వివిధ పార్టీలు, యువజన సంఘాలు, మండలంలోని అన్ని గ్రామపంచాయతీలో సర్పంచులు, జాతీయ జెండాలు ఎగురవేశారు.