Breaking news | పవన్ కు తీవ్ర జ్వరం..
ఎట్ హోమ్ కార్యక్రమానికి బ్రేక్
Breaking news | అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరం కారణంగా ఈ సాయంత్రం లోక్ భవన్లో నిర్వహించే “ఎట్ హోమ్” కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారు. ఈ విషయాన్ని లోక్ భవన్ అధికారులకు తెలిపారు. శనివారం ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించారు.
ఆ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నారు. రాజమహేంద్రవరంలో వైద్యులు ఉప ముఖ్యమంత్రివర్యులను పరీక్షించారు. కొంత ఉపశమనం కలిగిన అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి విదితమే. శస్త్ర చికిత్స అనంతరం చేయించుకోవాల్సిన ఫిజియో థెరపీ గురించి వైద్య నిపుణుల సూచనలు స్వీకరించనున్నారు.
