మహనీయుల త్యాగఫలమే స్వాతంత్ర్యం

  • కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి

హనుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ : ఎందరో మహనీయుల పోరాటం, త్యాగఫలంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుచ్చిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చల్లా చక్రపాణి, పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్, నాయకులు చిట్టిరెడ్డి రాజిరెడ్డి, దుబాసి కృష్ణమూర్తి, వరదరాజు, అబ్బు ప్రకాశ్‌రెడ్డి, చిందం రవి, హైదర్, నిమ్మల రమేష్, కొమ్ముల భాస్కర్, మార్కండేయ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.