మహనీయుల త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి…
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
అర్బన్ బ్యాంక్ చైర్మన్ జె ఎల్ మురళీధర్
అనంతపురం ప్రతినిధి, ఆగస్టు 15(ఆంధ్రప్రభ) : భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ కృష్ణ దేవరాయ భవన్ లోని అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో దేశభక్తి వాతావరణం నడుమ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు జె.ఎల్. మురళీధర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతికి వందనం చేశారు.
జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జె.ఎల్. మురళీధర్ మాట్లాడుతూ… భారతదేశానికి స్వేచ్ఛను అందించిన మహనీయుల త్యాగాలను ప్రతిఒక్కరూ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి పౌరుడు తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలని, యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అర్బన్ బ్యాంక్ ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తరించి, పారదర్శకతతో కూడిన బ్యాంకింగ్ సేవలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. సమాజ అభివృద్ధికి బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజల విశ్వాసమే తమకు అతిపెద్ద బలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ జాతీయ జెండాకు వందనం చేసి, దేశ సమగ్రత, ఐక్యత అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
చివరిగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి భారతీయుడు దేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని జె.ఎల్.మురళీధర్ ఆకాంక్షించారు. అనంతరం పాల్గొన్న అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి వేడుకలను ఘనంగా ముగించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు చింతల భాస్కర్ , జంగం శెట్టి రామాంజినేయులు, డైరెక్టర్లు బావి గడ్డ రమణయ్య, కృష్ణ కుమార్, మాగిశెట్టి చంద్రశేఖర్, గోల్డ్ భాష, వెంకటాద్రి, రోళ్ళ భాస్కర్, సుబ్రమణ్యం, అనీల్ నాయుడు, సీఈఓ నవీన్ కుమార్, మేనేజర్లు మేఘన, ఖాజా, సతీష్, రాధ, హేమా అండ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
