తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాల్గొన్న కేటీఆర్

హైదరాబాద్ (ఆంధ్రప్రభ): తెలంగాణ భవన్‌లో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నారని అన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.