జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి

పరకాల (ఆంధ్రప్రభ): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.