పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి: సర్పంచ్ సంగీత

కడెం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తోందని నర్సాపూర్ గ్రామ సర్పంచ్ డి.ఎస్. సంగీత రాజేష్ అన్నారు.

కడెం మండలం నర్సాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వం నుంచి మంజూరైన విద్యార్థుల బూట్లను సర్పంచ్ డి.ఎస్. సంగీత రాజేష్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పాఠశాలల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగం రమేష్, పంచాయతీ కార్యదర్శి నరేష్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనిత, ఉపాధ్యాయుడు సాయి కిరణ్, అంగన్‌వాడీ టీచర్ భూపేందర్ కౌర్, ఆశా కార్యకర్త మారుబాయి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.