ముచ్కూర్‌లో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న లోవోల్టేజ్ సమస్యకు విద్యుత్ శాఖ అధికారులు పరిష్కారం చూపారు.గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రూరల్ ఏఈ గస్కర్ వెంటనే స్పందించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడంతో లోవోల్టేజ్ సమస్య పరిష్కారమైంది.

దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఉన్న లోవోల్టేజ్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచ్ భాషటీ రమేష్, పంచాయతి కార్యదర్శి సంజయ్, పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.