ముస్తాబవుతున్న సింగ్ నగర్ స్టేడియం…
రేపు మంత్రి నారా లోకేష్ రాక..
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..
పాయకాపురం, ఆగస్టు 14(ఆంధ్రప్రభ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సింగ్ నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సింగ్ నగర్ స్టేడియానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. ఇందుకుగాను స్టేడియాన్ని రంగులతో ముస్తాబు చేస్తున్నారు. స్టేడియం ఆవరణాన్ని గ్రావెల్‌తో మెరకు చేయించారు. స్టేడియం గోడలకు రంగులు అద్దారు. రహదారుల వెంబడి వీఎంసీ సిబ్బంది పిచ్చి మొక్కలు తొలగించారు.

అన్నీ శాఖల సమన్వయంతో పంద్రాగస్టు వేడుకలు పర్యవేక్షణ చేస్తున్నారు. జాతీయ భావం ఉట్టిపడేలా స్టేడియం మూడు రంగులతో ముస్తాబయ్యింది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరావు పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని అధికారులను సమన్వయం చేసుకుంటూ, మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.

డీసీపీ గుణ్ణం రామకృష్ణ తన సిబ్బందికి బందోబస్తు గురించి పలు సూచనలు చేశారు. పోలీసులు స్టేడియంలో కవాతు నిర్వహించారు. పలు విద్యాసంస్థల విద్యార్థులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. 50సకటాలు అందరిని అలరిస్తాయని అధికారులు చెబుతున్నారు.
