17న ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా..
- ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి..
- ప్రిన్సిపాల్ రమేష్..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం ప్రభుత్వ ఐటీఐ,ఏటీసీలో ఈ నెల 17న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళాను నిర్వహించనున్నట్లు ఆ ఐటీఐ,ఏటీసీ ప్రిన్సిపాల్ వై.రమేష్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. ప్రముఖ ఎంఎన్సీ, రెన్ మద్రాస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శక్తి హార్మోనేస్,సీఐఎం టెక్నాలజీ వోయిత్ టర్బో ప్రైవేట్ లిమిటెడ్, ఆదర్శ ఆటోమొబైల్స్ లిమిటెడ్,ఏటీఎఆర్ కంపెనీ లిమిటెడ్, హైదరాబాద్ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని ఆయన తెలిపారు.ఈ అవకాశాన్ని తప్పనిసరిగా జిల్లా ప్రభుత్వ ఐటీఐ,ఏటీసీ పాస్ అవుట్ విద్యార్థులందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఇతర వివరాలకు జన్నారం ఐటీఐ,ఏటీసీలలో సంప్రదించాలని ఆయన కోరారు.
