కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే చింతమనేని

అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చ

ఏలూరు, ఆంధ్రప్రభ: దెందులూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది.

ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి. జగదాంబ, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్నతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.