బాసర అమ్మవారిని దర్శించుకున్న రవీందర్ కుమార్ గౌడ్
బాసర, ఆంధ్రప్రభ : బాసర బాలాలయంలోని అమ్మవారిని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రవాణా శాఖ ఉప కమిషనర్ రవీందర్ కుమార్ గౌడ్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న రవీందర్ కుమార్ గౌడ్‌ను ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజ నిర్వహించి హారతి ఇచ్చి ఆశీర్వదించారు.
ఆశీర్వచన మండపంలో వేద మంత్రాలతో ఆశీర్వదించిన అనంతరం అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు తిరుపతి, రజినీకాంత్, రమ్యారాణి, ఆలయ ఈఓ అంజనీదేవి, ఏఈఓ గంగా శ్రీనివాస్, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, సూపరింటెండెంట్లు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
