దేశాభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలి..
- ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవహ బుర్ర సదయ్య
చిట్యాల, ఆంధ్రప్రభ : దేశ అభివృద్ధిలో విద్యార్థులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవహ బుర్ర సదయ్య కోరారు. యువ సమ్మేళన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘దేశం కోసం యువత.. దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల స్థాయి ఇంటర్మీడియట్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బుర్ర సదయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగడంతో పాటు దేశభక్తి కలిగి ఉండాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో చిట్యాల ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, ఏబీవీపీ తెలంగాణ ప్రాంత వసతి గృహాల కన్వీనర్ వేల్పుల రాజ్‌కుమార్, బుర్ర అభిజ్ఞ గౌడ్, అవినాష్, మనోజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
