చేంగల్‌లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక (జీపీడీపీ)లో భాగంగా భీమ్‌గల్ మండలంలోని చేంగల్ గ్రామ పంచాయతీ లో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుమాల మమత (రాజు) సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాతి మోహన్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వినయ్, వార్డు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ శాఖ ఏఈఓ స్నేహ, ఇరిగేషన్ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
