సీనియర్ జర్నలిస్ట్ సాయిలు సాగర్‌కు పరామర్శ..

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సాయిలు సాగర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శుక్రవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా సాయిలు సాగర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.