యువకుడు హత్య..
ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంకు యువకుడిని దారుణ హత్య చేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనాథ్(24)అనే యువకుడు మధు ల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుని తొలుత వాగ్వాదం జరిగింది. అనంతరం మధు కత్తి తీసుకొని శ్రీనాథ్ ను దారుణంగా పొడిచాడు. దీంతో శ్రీనాథ్ అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అనంతరం సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
