బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ..
మంగపేట, ఆంధ్రప్రభ : బీజేపీ మంగపేట మండల అధ్యక్షుడు రావుల జానకిరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. మంగపేట జడ్పీ పాఠశాల నుండి మంగపేట తెలంగాణ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. జాతీయ జెండాలు చేతబట్టి మంగపేట మండల విద్య శాఖ అధికారిణి పోడెం మేనక, జడ్పీ పాఠశాల టీచర్లు, స్టూడెంట్స్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో ర్యాలీగా ముందుకు సాగుతూ భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ ఇచ్చిన దేశభక్తి నినాదాలతో మండల కేంద్రం మార్మోగిపోయింది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తిరంగా మన దేశ గౌరవానికి ప్రతీక అని, ప్రతీ భారతీయుడి గుండెల్లో దేశభక్తి నిండాలని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని అన్నారు. హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రతి ఇంటా తిరంగా, ప్రతీ గుండెలో దేశభక్తి ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారిణి పొదెం మేనక, బీజేపీ మంగపేట మండల అధ్యక్షుడు రావుల జానకిరావు , మంగపేట జడ్పీ పాఠశాల టీచర్లు అనసూర్య , సునీత, ప్రవీణ, జే.వెంకటేశ్వర్లు, ఎస్.నాగేందర్ , పీ.నాగేశ్వర రావు, రాజు, అనంతరావు, రమేష్, చంద్ర శేఖర్, సతీష్, బీజేపీ నాయకులు లింగంపెల్లి శ్రీనివాస రావు, రామిడి సురేష్ పటేల్, ఎర్రంకాని వీరేన్ కుమార్, చల్లా రాంకీ, యడ్లపెల్లి సాయి, శ్రీనివాస్, నిడదవోలు శ్రీనివాస్, బడే జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
