మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు..
- సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా సులభంగా, వేగంగా అమరావతికి చేరుకోవచ్చు
- వైసీపీ హయాంలో అప్పులు…
- కూటమి హయాంలో అభివృద్థిలో ముందున్నాం
- 19వ డివిజన్‌లో టీడీపీ డోర్-టు-డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్
కృష్ణలంక, ఆంధ్రప్రభ : అభివృద్థి, సంక్షేమంలో సమతుల్యత పాటిస్తూ రాష్ట్రానికి చక్కటి పాలన అందిస్తున్న విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. గురువారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్‌లోని డాక్టర్ వై.వి.రావు హాస్పటల్ రోడ్డు, లబాబిన్ కాంప్లెక్స్ ఏరియాలో టిడీపీ డోర్-టు-డోర్ కార్యక్రమం జరిగింది.
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్యఅతిధిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజనరీ ఉన్న నాయకుడు అని కొనియాడారు.

రాష్ట్ర అభివృద్థిని, ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి సమతుల్యత పాటిస్తూ ప్రజలు మెచ్చేలా పాలన సాగిస్తున్నారని చెప్పారు. అందరూ మెచ్చేలా రాష్ట్ర రాజధాని అమరావతిని చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే సీడ్ యాక్సిస్ రోడ్డును, బకింగ్‌హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జిని, కొండవీటి వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (గురువారం) ప్రారంభించారని తెలిపారు. రాజధాని అమరావతిలోకి రాకపోకలను మరింత వేగవంతం, సులభతరం చేసేందుకు సీడ్ యాక్సిస్ రోడ్డు, బ్రిడ్జిలు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు.
వైఎస్.జగన్ హయాంలో కుంటుపడిన రాష్ట్ర అభివృద్థిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనకున్న పాలనానుభవం, సమర్థత, విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్థి పథాన నడిపిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వివరించారు. వైఎస్.జగన్ హయాంలో అప్పులు చేయడంలో రాష్ట్రం ముందు ఉండేదని, కూటమి ప్రభుత్వంలో అభివృద్థిలో ముందు ఉంటోందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్థికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ప్రజలు అంతా మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో భాగం సాయి ప్రసాద్, ఎస్.ఫిరోజ్, పేరేపి ఈశ్వర్, దున్న ఏసురత్నం, ఎండీ ఖలీల్ అఫ్సర్, ఎండీ.హుస్సేన్, సిరాజ్, కోటి, పరిశిపోగు విజయ్, శాంతికుమారి, నామాల జ్యోతి, శాయమ్మ, శాంతి తదితరులు పాల్గొన్నారు.
