విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు : డీసీపీ భాస్కర్
చెన్నూర్, ఆంధ్రప్రభ : చదువుతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవలసిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. గురువారం స్థానిక సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో సామాజిక మాధ్యమాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ… విద్యార్థులకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రూల్స్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, ఆత్మహత్యలు, ర్యాగింగ్, సెల్ ఫోన్ వినియోగం వల్ల ఏర్పడే అనర్థాలు మొదలగు విషయాలపై అవగాహన కల్గి ఉండాలని సూచించారు. బసామాజిక మాధ్యమాల ప్రభావం, ఆకతాయిల వేధింపుల బారిన పడకుండా పరిశోధనలు చేశారు.
విద్యార్థులు సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతతో వినియోగించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. అలాగే విద్యార్థులు జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆత్మహత్య వంటి ఆలోచనలు చేయకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి చదువే ప్రధాన మార్గమని, విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఈ సందర్బంగా విద్యార్థులకు డిసిపీ సూచించారు. ఈ సదస్సులో సీఐ బన్సీలాల్, ఎస్సై రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
