కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడిగా దబ్బేట అనిల్‌

చిట్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా,కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల నూతన అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన దబ్బేట అనిల్‌ను నియమించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ గురువారం ఉత్తర్వులు జారి చేశారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌తో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు ఆరైతులకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతనంగా మండల అధ్యక్షుడీగా నియమించబడ్డ దబ్బేట అనిల్‌ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సూచించారు.

గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. గత ఎనిమిది సంవత్సరాలుగా ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ ఆదేశాలతో ప్రజలతో మమేకమై, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని, గత ఐదు సంవత్సరాలుగా మండల కేంద్రం ఎంపీటీసీగా ప్రజల సంక్షేమం కోసం పనిచేశానన్నారు. తన సేవలను గుర్తించి పార్టీ మండల అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి ఎస్ ఆర్, జిల్లా, మండల పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.