299 డివిజన్ లో ఘనంగా ‘తిరంగా ర్యాలీ

  • ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తి నింపడమే ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్దేశం..
  • పాల్గొన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు సముద్రాల హంసరాణి కృష్ణ గౌడ్..

మేడ్చల్, ఆంధ్రప్రభ : భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 299 గుండ్లపోచంపల్లి డివిజన్‌లో గురువారం రోజు తిరంగా ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ సముద్రాల హంసరాణి కృష్ణ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, చేతిలో జాతీయ జెండా పట్టుకుని ర్యాలీని ముందుండి నడిపించారు. ​ఈ సందర్భంగా హంసరాణి మాట్లాడుతూ.. తిరంగా కేవలం మూడు రంగుల జెండా మాత్రమే కాదని, అది భారత సమగ్రతకు, ఐక్యతకు స్వాతంత్ర్య సమరయోధుల అమూల్య త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ పిలుపుతో దేశంలో జాతీయ భావం మరిన్ని రెట్లు పెరిగిందని అన్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయ భేదాలను పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ జాతీయ జెండా నీడన ఒక్కటికావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం ప్రతి పౌరుడు పునరంకితం కావాలని కోరారు. ​త్రివర్ణ పతాకాలతో, “భారత్ మాతాకీ జై”, “వందే మాతరం” నినాదాలతో డివిజన్ పురవీధులన్నీ దేశభక్తితో హోరెత్తాయి. ఈ ర్యాలీలో త్రివేణి ఇంద్ర స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు బీజేపీ నాయకులు సముద్రాల కృష్ణ గౌడ్, అర్జున్ బాబు, బూత్ అధ్యక్షులు మల్లేష్, ప్రభాకర్, బిజెపి కార్యదర్శులు కె. సత్యనారాయణ, బాలకృష్ణ, శ్రీనివాస్, రాకేష్, మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వై. గిరి, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.