జహీరాబాద్‌ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

  • మృతుల కుటుంబాలకు సానుభూతి..
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం.. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.