వెయిట్ లిఫ్టింగ్ లో జాకీర్ హుస్సేన్ విద్యార్థికి బంగారు పతకం

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాస్థాయి అమరావతి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ కళాశాల విద్యార్థి ఎం.శివకేశవ బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ జాఫర్ సాధిక్ తెలిపారు. విజయవాడలోనే కృష్ణలంక జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన శివకేశవ రాష్ట్రస్థాయి పోటీలకు జరిగిన ఎలక్షన్ లో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివ కేశవను, విద్యార్థికి అవసరమైన శిక్షణ ఇచ్చిన వీకే అకాడమీ చైర్మన్ కె.లీల వాణి, కోచ్ వి.ఎన్.రాజశేఖర్ ను కరస్పాండెంట్ నజీర్ పాషా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు మస్తాన్ వలీ, నాగుల్ మీరా, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.