Tirupati | కోళ్ల కోసం ఎగబడ్డ జనం..!
ఘాట్‌రోడ్డుపై చెల్లాచెదురుగా కోళ్లు..
బస్తాల్లో నింపుకుని తీసుకెళ్లిన స్థానికులు
Tirupati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్‌రోడ్డులో మంగళవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కోళ్లతో భాకరాపేట నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న పెద్ద సంఖ్యలో కోళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. రోడ్డుపై పడిన కోళ్లను పట్టుకునేందుకు పలువురు పోటీపడ్డారు. కొందరు వాటిని బస్తాల్లో నింపుకుని తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు భాకరాపేట ఘాట్‌రోడ్డుపై సందడి నెలకొంది.
కోళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటం, వాటిని స్థానికులు పట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలను పలువురు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రమాదం కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయా? ఎంతమేర కోళ్లు నష్టపోయాయి? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
