ఎడపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ఘర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్‌ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌చార్జి వడ్డీ మోహన్‌రెడ్డి, ఎడపల్లి సర్పంచ్‌ కందగట్ల రాంచందర్‌ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు ర్యాలీలో ముందుకు సాగారు. పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొని జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.