ఆలయం వద్ద పుష్కర ఘాట్ నిర్మించాలని వినతి

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలం లింగాపూర్‌ గ్రామంలోని గోదావరి తీరాన ఉన్న గుండు వీర హనుమాన్‌ ఆలయం వద్ద మినీ పుష్కర ఘాట్‌ నిర్మించాలని గ్రామస్తులు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడమ బొజ్జును కోరారు. ఈ మేరకు లింగాపూర్‌ గ్రామ సర్పంచ్‌ కుమ్మరి రంజిత్‌కుమార్‌, ఉప సర్పంచ్‌ కమ్ముల లక్ష్మీస్వామి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పి.రాజేశ్వర్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు బెల్లాల రాజేందర్‌, మాజీ ఉప సర్పంచ్‌ మాదాసు నగేష్‌ తదితరులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

వినతిపై స్పందించిన ఎమ్మెల్యే వెడమ బొజ్జు.. పుష్కర ఘాట్‌ నిర్మాణానికి సంబంధించి అధికారులతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోవిందుల మధుసూదన్‌, పాత్రికేయులు మాదాసు రాజేందర్‌, సుతారి రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.