ఇరాన్ అమెరికా యుద్ధంలో పాక్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు
త్రిశూల కూటమి వెనుక పాకిస్తాన్ వ్యూహం
సౌదీ, యూఏఈలతో భారత్ బంధం కీలకం
పాకిస్తాన్ ఆర్థిక అవసరాలే అసలు లక్ష్యమా?
ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ మరోసారి మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు వస్తే, అమెరికా అందుకు నిరాకరించింది. పాకిస్తాన్ కన్నా సౌదీ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లలో ఏదో ఒక దేశం మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదని సూచించింది. ఇందుకు కారణం అందరికీ తెలిసిందే. అమెరికా తరఫున మధ్యవర్తిత్వం వహించినందుకు పాకిస్తాన్ ఐదు బిలియన్ డాలర్ల సిరీ రణ సాయం అందించాలని కోరింది. అమెరికా ఇప్పటికే, రక్షణ వ్య యాన్ని భరించలేక తంటాలు పడుతోంది. ఇరాన్తో యుద్ధం వల్ల అమె రికా రక్షణ రంగం చాలా వరకూ నష్టాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, ఆయుధాగారం ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికా పాకిస్తాన్ డిమాండ్ని అందుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అందుకోసమే యూ ఏఈ ని లేదా, సౌదీని కానీ, మధ్యవర్తిత్వం చేయాలని కోరుతోంది.
అయితే, సౌదీ ఇప్పటికే పాకిస్తాన్కి రుణాల రూపంలో సాయం చేసింది. ఈ కారణంగా ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ కు వ్యతిరే కంగా త్రిశూల కూటమిని ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తోంది. ఈ కూటమిలో పాకిస్తాన్, సౌదీ, టర్కీలను భాగస్వాములుగా చేయాలని ప్రతిపాదించింది. ఈ మూడు దేశాల్లో అణు సంపన్న దేశం పాకిస్తాన్ మాత్రమే. వీటిలో దేనిపై పరాయిదేశం దాడి చేసినా, మిగిలిన రెండు దేశాలు అండగా నిలిచేందుకు రావాలన్న ప్రతిపాదన చేసింది.
నిజానికి ఇప్పుడు పాకిస్తాన్పై దాడి చేయాల్సిన అవసరం ఈ రెండింటిలో ఏ దేశానికీ లేదు. ఆ అవసరం కూడా లేదు. ఇస్లాం మతానికి అత్యంత పవిత్రమైన మక్కా నగరం వేదికగా ఈ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగానే నడుస్తోంది. పాకిస్తాన్ లక్ష్యం ఎప్పుడూ భారత్పైనే అన్న సంగతి యావత్ ప్రపంచానికీ తెలుసు.
ఈ మూడు దేశాలూ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మన దేశంపై ఎటువంటి ప్రభావం ఉంటుందనే చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. నిజానికి పాకిస్తాన్ మినహా, మిగిలిన రెండు దేశాలూ మనకు మిత్ర దేశాలే. పాకి స్తాన్ కూడా, మనకు శత్రు దేశం కాదు. పాకిస్తాన్ తనను తాను శత్రు దేశంగా పరిగణించుకుంటున్నది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ వ్యూహం ఏమిటి అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
పాకిస్తానికి ఇప్పుడు ధారాళంగా నిధులు కావాలి. ఏదో ఒక కారణం చూపి మిగిలిన దేశాల నుంచి నిధులను గుంజాలని చూస్తోంది. తప్ప వేరే కారణం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కుటిల యత్నాలను ఎదుర్కోవడానికి భారత్ యూఏఈతోనూ, ఇతర దేశాలతోనూ తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలి.
సౌదీ, యూఏఈలు భారత్లో ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇవన్నీ మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించినవి. ఈ రంగాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ రెండు దేశాలనుంచి భారత్ మరింతగా పెట్టుబడులను ఆకర్షించాల్సి ఉంది.
భారత్లో పెట్టిన పెట్టుబడులు తిరుగులేనివని ఈ రెండు దేశాలు భావిస్తున్నాయి. అదే పాకిస్తాన్లో పెట్టుబడుల విషయంలో వాటి అనుమానాలు వాటికి ఉన్నాయి. ఈ విషయం పాకిస్తానీ తెలుసు.
