ఘనంగా ఎమ్మెల్యే కొలికపూడి జన్మదిన వేడుకలు

  • నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు
  • పలు ప్రాంతాల్లో కేక్‌ కట్ చేసి మిఠాయిల పంపిణీ
  • ఎమ్మెల్యే కొలికపూడికి అధికారులు, నాయకులు, కార్యకర్తల శుభాకాంక్షలు
  • వాట్సప్‌ స్టేటస్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని

(తిరువూరు, ఆంధ్రప్రభ) : తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించాయి. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) సైతం తన వాట్సప్‌ స్టేటస్‌ ద్వారా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.