ఆపదలో అండగా.. సీతక్క ఆపన్నహస్తం

రోడ్డు ప్రమాద బాధితుడు దాసరి సుధాకర్‌కు రూ.50 వేల ఆర్థిక సాయం
గార్డియన్ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించిన బరిగల భాస్కర్

గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో గాయపడి హన్మకొండలోని గార్డియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములుగు జిల్లా దళిత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దాసరి సుధాకర్‌ను మంత్రి సీతక్క వ్యక్తిగత సహాయకుడు బరిగల భాస్కర్ పరామర్శించారు.

సుధాకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి సీతక్క, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఫైడాకుల అశోక్ సహాయ సహకారాలతో సుధాకర్‌కు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని బరిగల భాస్కర్ అందజేశారు.

ఆపదలో ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలవడం కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేకత అని ఆయన అన్నారు. కష్టకాలంలో కార్యకర్తకు అండగా నిలవడమే నిజమైన నాయకత్వమని, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి భరోసా ఇవ్వడమే మంత్రి సీతక్క లక్ష్యమని పేర్కొన్నారు.

సుధాకర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని బరిగల భాస్కర్ ఆకాంక్షించారు.