నేడు మర్కల్, తిర్మన్‌పల్లిలో విద్యుత్ అంతరాయం

సదాశివనగర్, ఆంధ్రప్రభ: సదాశివనగర్ మండలంలోని మర్కల్, తిర్మన్‌పల్లి గ్రామాల పరిధిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏఈ గంగాధర్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు ఏఈ తెలిపారు. విద్యుత్ అంతరాయం సమయంలో వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.