అసిఫాకు ఎమ్మెల్యే బొండా ఉమా నివాళి..

(పాయికాపురం ఆంధ్రప్రభ ) : విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం కుమార్తె ఎండీ అఫిఫా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బొండా ఉమామహేశ్వరరావు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అఫిఫా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయస్సులోనే అఫిఫా మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.