కడెంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండల కేంద్రంలో రాజ్‌గోండ్ సేవా సమితి నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకోవాల్సిన అవసరంపై నాయకులు మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధి, విద్య, ఉపాధి, సామాజిక హక్కుల కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వేడుకల్లో భాగంగా ఆదివాసీ వీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి, జెండాలు చేతబట్టి నినాదాలు చేస్తూ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్‌రెడ్డి, ఆర్టీఏ జిల్లా సభ్యుడు తుమ్మల మల్లేష్‌యాదవ్, కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యాంసుందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడికే మల్లేష్‌యాదవ్, మండల అధ్యక్షుడు రేంకల శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు కోలా గంగన్న, చెన్నూరి రాజన్న, వసీ యొద్దీన్, సామాజికవేత్త సీహెచ్. రాజేష్‌కుమార్, రాణిగూడ, చిట్యాల్, గంగాపూర్ గ్రామాల సర్పంచులు తొడసం సీతారాం, చీమల భీమేష్, వెడమ జంగు పటేల్, రాజ్‌గోండ్ సేవా సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తొడసం భీమ్రావు, ఉపాధ్యక్షుడు మరుసుకోలా భీంరావు, ప్రధాన కార్యదర్శి ఆత్రం భీంరావు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం భగవంత్‌రావు, నర్సాపూర్ మాజీ సర్పంచ్ కుడిమేత బాదురావు తదితరులు పాల్గొన్నారు. రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా, మండల నాయకులు, ఆదివాసీ గిరిజన యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
