పోచమ్మ ఆలయంలో ఘనంగా ఆషాఢ పూజలు

చెన్నూర్, ఆంధ్రప్రభ: ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో చెన్నూరు మధునపు పోచమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢ మాసం ప్రారంభం నుంచే ప్రతి ఆది, గురువారాల్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని బోనాలు, పట్నాలు సమర్పిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో ఆషాఢ మాసంలో చివరి ఆదివారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఐ బన్సీలాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ క్రమబద్ధంగా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టారు.