బసవేశ్వరుని బోధనలు ఆచరణీయం

వికారాబాద్, ఆంధ్రప్రభ: మహాత్మా బసవేశ్వరుని బోధనలు నేటి సమాజానికి ఆచరణీయమని వీరశైవ సమాజం వికారాబాద్‌ అధ్యక్షుడు అప్ప విజయకుమార్‌ అన్నారు. ఆదివారం ఎర్నేపల్లిలోని బసవేశ్వర విద్యాసంస్థలో బసవరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన బోధనలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు, విద్యాసంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.