ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
వికారాబాద్ (ఆంధ్రప్రభ): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 10న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని వికారాబాద్ జిల్లా హర్ ఘర్ తిరంగా కన్వీనర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌లో బీజేపీ కార్యకర్తలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
‘నేను మా ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నాను.. మీరు కూడా మీ ఇంటిపై జెండా ఎగురవేయండి’ అనే సందేశంతో ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని అనిల్ యాదవ్ సూచించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
