గుడివాడలో ‘ఇంటింటికి టీడీపీ’…
- ప్రజలతో మమేకమవుతున్న ఎమ్మెల్యే రాము
- 19వ వార్డులో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే
- ప్రజల సమస్యలు తెలుసుకుంటూ…
- తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడుతున్న ఎమ్మెల్యే
గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇస్తూ.. గుడివాడలో ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మమేకమయ్యారు. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం 19వ వార్డులో ఎమ్మెల్యే రాము కూటమి శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. బస్టాండ్ సెంటర్‌లో కూటమి శ్రేణులు ఎమ్మెల్యే రాముకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఐఎంఏ హాల్ రోడ్డులోని వ్యాపార దుకాణాలను సందర్శించిన ఎమ్మెల్యే రాము వ్యాపారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలాజీ థియేటర్, పరిసర ప్రాంతాల్లోని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నిర్వాహకులు, మోటార్ మెకానిక్ గ్యారేజీల యజమానులు, కార్మికులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం సత్యనారాయణపురం పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే రాము.. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు.
వార్డులో రోడ్ల సమస్యను పరిష్కరించినందుకు పలువురు ప్రజలు ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రాము.. వార్డులో నూతన పైప్‌లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, పనులు పూర్తయిన వెంటనే తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, గుడివాడ నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రాము పేర్కొన్నారు. ప్రజల నుంచి వస్తున్న ప్రతి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
19వ వార్డులో రోడ్ల సమస్యను పరిష్కరించామని, తాగునీటి సమస్యను కూడా నూతన పైప్‌లైన్ ద్వారా త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గుడివాడ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తమ ఇళ్లు, దుకాణాల వద్దకే వచ్చి ఎమ్మెల్యే రాము ఆప్యాయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యేను పలువురు అభినందించారు.
ఈ పర్యటనలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు, గుడివాడ జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, జనసేన నాయకులు సాయన రాజేష్,టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, మజ్జాడ నాగరాజు, పోలాసి ఉమా,షణ్ముఖ రెడ్డి, కంచనపల్లి సుబ్రమణ్యం, యార్లగడ్డ సుధారాణి,లింగం ప్రసాద్, అడుసుమిల్లి శ్రీనివాసరావు,నిమ్మగడ్డ సత్యసాయి, కడియాల గణేష్, వంగపండు ఆదినారాయణ, నేరుసు కాశి, ముళ్ళపూడి రమేష్ చౌదరి, మున్వర్, మౌలాలి, దేవరపల్లి కోటి,లోయ విజయ్, ఆనంద్, ఇమాన్యుయల్, 19వ వార్డు నాయకులు వల్లభనేని రత్నా బాబు, అట్లూరి కృష్ణ ప్రసాద్,K. శ్రీనివాస్ వర్మ, P. నాంచారమ్మ, వేమూరి ప్రతిమ, శ్రీనివాసరావు, పట్టపు రాజు వెంకటేశ్వరరావు, రాజులపాటి రవిప్రసాద్, సూరి బాబు, పలువురు కూటమి నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
