ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో సారె సమర్పణ

  • ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పణ
  • సాంప్రదాయంగా సమర్పించిన ఇంజనీరింగ్ సిబ్బంది..

(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రి దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో శనివారం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. ఆలయ ఈఈ రమాదేవి, డీఈఈ అశోక్‌కుమార్, రవీంద్ర తదితరులు జమ్మిదొడ్డి నుంచి సారెతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఇంజినీరింగ్‌ విభాగం అధికారులకు ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఆరో అంతస్తులో సారెను సమర్పించారు. ఆషాఢ మాసంలో కనకదుర్గమ్మను తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించి సారె సమర్పించే సంప్రదాయంలో భాగంగా దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళా భక్తుల భక్తిశ్రద్ధలతో ఆషాఢ మాసంలో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.