అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి కర్ణాటకలోని రాయచూర్ ఎస్సార్ నగర్‌కు చెందిన కే.వెంకటరావు, పార్వతి దంపతులు రూ.2.50 లక్షల విరాళాన్ని సమర్పించారు. అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో అన్నదానానికి తమ వంతు సహకారంగా ఈ మొత్తాన్ని అందజేశారు.
ఆలయ అధికారులు, అర్చకుల సమక్షంలో దంపతులు విరాళాన్ని సమర్పించారు. అనంతరం వారికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ డిప్యూటీ ఈవో కిషోర్ దాత దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
అన్నదాన కార్యక్రమానికి విరాళం అందించిన దాతలను ఆలయ అధికారులు అభినందించారు. భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతోందని తెలిపారు.
