1,538 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 1,538 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ప్రత్యేక నియామక డ్రైవ్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి సర్కిల్‌లో 88 పోస్టులు, తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్‌లో 32 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా నిర్దిష్ట నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 7 నుంచి ప్రారంభమై, ఆగస్టు 27 వరకు కొనసాగుతుంది. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా జరుగుతుంది..

పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..