నిండుకుండలా కుప్కాల్ గ్రామ చెరువు
అలుగు పారడంతో ఆనందంలో రైతులు
భారీ వర్షంతో చెరువుకు జలకళ
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం కుప్కాల్ గ్రామ చెరువు నిండుకుండలా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గురువారం రాత్రి గ్రామంలో భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులోకి భారీగా నీరు చేరి అలుగు పారుతూ బయటకు వచ్చింది. దీంతో చెరువుకు జలకళ సంతరించుకుంది.
వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ ప్రజలు వరుణ దేవుడికి కప్పతల్లి ఆటలు నిర్వహించడంతో పాటు గ్రామ దేవతలకు పాలాభిషేకం చేశారు. తాజాగా భారీ వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
